Hariteja elimination: ఈ వారం హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్.. నెటిజన్ల కామెంట్ల మోత!
on Nov 4, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చాక ఆట మాములుగా లేదు. ఎంటర్టైన్మెంట్ కి, గేమ్స్ కి ఒక్కో కంటెస్టెంట్ తమ వంద శాతం ఇస్తున్నారు. అయితే హౌస్ లోకి వచ్చిన హరితేజ తీవ్రంగా డిస్సపాయింట్ చేస్తోంది.
టాస్క్ లలో తనే ఉండాలని భావనతో మొన్నటి వారం జరిగిన టాస్క్ లలో నిఖిల్ కి అన్యాయం చేసింది. అదంతా చూసిన నెటిజన్లు ఈమెని ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదంటూ నెగెటివ్ కామెంట్లు చేశారు. అసలెమీ ఆడటం చేతకాని వాళ్ళని హౌస్ లోకి తీసుకొచ్చారంటూ హరితేజ పేరు మీద పోస్టులు, ట్వీట్లు చేశారు. దాంతో గత మూడు వారాల నుండి నామినేషన్ల చివరన ఉన్నా.. వేరే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యారు. లాస్ట్ వీక్ కూడా నయని పావని కంటే హరితేజ మధ్య ఓటింగ్ పెద్దగా డిఫరెన్స్ లేదు. దీనిని బట్టి తను హౌస్ లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదని తెలిసిపోతుంది.
ఇక ఈ వారం నిఖిల్, గౌతమ్, యష్మీ, ప్రేరణ ఇలా స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు. దాంతో హరితేజ ఎలిమినేషన్ కన్ఫమ్ అనేది తెలుస్తోంది. తనేదైనా పర్ఫామెన్స్ ఇస్తేనే సేఫ్ అవుతుంది. లేదంటే కచ్చితంగా ఈ వారం హరితేజ బ్యాగ్ సర్దుకోవాల్సిందే. అయితే ఈ సీజన్ లో హరితేజ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వడం లేదనేది అందరికి తెలిసిన విషయమే.
Also Read